పశ్చిమ బెంగాల్లోని కాళీఘాట్ లో ఉన్న తన నివాసంపై శనివారం తెల్లవారుజామున 2 గంటలకు గుర్తుతెలియని దుండగులు రాళ్లు, ఇటుకలతో దాడి చేశారని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. ఈ దాడిలో కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని, ఆరు నెలల్లో తనపై ఏడుసార్లు దాడికి యత్నించారని ఆయన ఆరోపించారు.