టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి నటి అనుష్క సేన్ మాట్లాడారు. తమ మధ్య పదేళ్ల పరిచయం ఉందని, ధోనీని తాను ఆప్యాయంగా మాహి చాచు అని పిలుస్తానని తెలిపారు. ఇద్దరం రాంచీకి చెందినవారమని, ఇప్పటివరకు కలిసి 21 ప్రకటనల్లో నటించామని ఆమె చెప్పారు.