కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి జలాలు, ఎల్ నినో ప్రభావంపై శాసనసభలో రెండ్రోజుల పాటు చర్చకు రావాలని మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. డిసెంబర్‌లో ఈ చర్చను ఏర్పాటు చేయాలని కొడంగల్‌లో రైతులతో జరిగిన భేటీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఆయన కోరారు.