హత్య కేసులో నెల్లూరు జైలులో ఉన్న వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి పెళ్లకూరు జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. స్థానిక వివాదంలో ఒకరు గుండెపోటుతో చనిపోతే ఆయనపై అక్రమంగా కేసు పెట్టారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. జైలు నుంచే ఆయన నామినేషన్ వేయగా కుటుంబ సభ్యులు ప్రచారం చేశారు.