మహబూబ్‌నగర్‌లో రూ.1.10 లక్షల లంచం తీసుకుంటూ జిల్లా యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ అధికారి రాజశేఖర్‌రెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉమేశ్‌ ఏసీబీకి చిక్కారు. ఆగస్టు నెలకు సంబంధించిన రూ.3.10 లక్షల క్యాటరింగ్‌ బిల్లుల మంజూరు కోసం వారు ఈ లంచం డిమాండ్‌ చేశారని, గురువారం రెస్టారెంట్‌లో పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.