నల్లగొండ వైద్యారోగ్యశాఖలో అక్రమ కారుణ్య నియామకంపై వన్‌టౌన్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పదవీ విరమణ పొందిన వెంకటేశ్వర్లు ముందే చనిపోయినట్లు తప్పుడు రికార్డులతో ఆయన కుమారుడు రాజు ఉద్యోగం పొందాడు. ఈ కేసులో మృతుడి భార్య వసంత, సతీశ్, సైదులు, అశోక్‌లను అరెస్ట్ చేసి, శాలిగౌరారం మెడికల్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు.