సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ, అల్లం రాజయ్య, అల్లం వీరయ్యల తల్లి అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. సాహిత్య, జర్నలిజం, తెలంగాణ ఉద్యమాల్లో ముద్ర వేసిన ముగ్గురు కుమారులను అందించిన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.