చలికాలంలో బెల్లం టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. నీటిలో అల్లం, యాలకులు, టీ పొడి వేసి మరిగించాక స్టవ్ ఆపి, టీ కాస్త చల్లారాకే బెల్లం, పాలు కలపాలి. ఇలా చేయడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయని, జీర్ణక్రియ మెరుగై జలుబు, దగ్గు తగ్గుతాయని చెబుతున్నారు.