దీపావళి సందర్భంగా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పండితులు వారికి తీర్థప్రసాదాలు అందించగా, ఆలయ నిర్వాహకులు తలసానిని ఘనంగా సన్మానించారు. అనంతరం వారు ఆలయం వద్ద ఫొటోలు దిగారు.