హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామిక వాడలోని ఒక గోదాంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చుట్టుపక్కల గోదాములకు వ్యాపించాయి. స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది.