వరంగల్‌కు చెందిన ఇట్టబోయిన సాయి శివాని యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు సాధించారు. ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్ వనరులతో ప్రిపేర్ అయ్యారు. ట్రిపుల్ ఐటీ ఒంగోలులో బీటెక్ పూర్తి చేసిన ఈమె, చిన్నప్పటి కలను నెరవేర్చుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.