ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తుది ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 582 జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ 406, వైకాపా 76, జనసేన 73, బీజేపీ 20 గెలిచాయి. 7,768 ఎంపీటీసీ సీట్లలో టీడీపీ 4,806, వైసీపీ 1,711, జనసేన 938 స్థానాల్లో విజయం సాధించాయని ఎస్‌ఈసీ తెలిపింది.