బాలీవుడ్ నటులు ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీరిద్దరూ వేర్వేరుగా కార్యక్రమాలకు హాజరుకావడంపై చర్చ జరిగింది. అయితే, మనీష్ మల్హోత్రా నిర్వహించిన దివాళీ వేడుకకు ఈ జంట చేయి చేయి పట్టుకుని కలిసి వచ్చి పుకార్లకు చెక్ పెట్టింది.