మురసు తుఫాన్ కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. మొత్తం 35,066 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మంలో 23,140 ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 11,926 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అశ్వారావుపేట మండలంలో రోడ్లు కోతకు గురికాగా మిర్చి, వేరుశనగ, వరి పంటలు తీవ్రంగా నష్టపోయాయి.