ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో చిక్కుకున్న మత్స్యకారులు, వారిని కాపాడేందుకు వెళ్లి బోటు బోల్తా పడి గల్లంతైన ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు క్షేమంగా ఒడ్డుకు చేరాయి. రాత్రంతా చెట్ల కొమ్మలను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న మొత్తం 11 మంది, వరద తగ్గడంతో గురువారం ఉదయం సురక్షితంగా బయటపడ్డారు.