హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఆస్బెస్టాస్ కాలనీలో ఉన్న పేపర్ టీ కప్పులు, ప్లేట్ల తయారీ కంపెనీలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.