గాయం కారణంగా జట్టుకు దూరమైన భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు నిరాశ ఎదురైంది. నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ప్రకటించిన బరోడా జట్టులో అతడికి చోటు దక్కలేదు. క్రునాల్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించనున్న ఈ టోర్నీ ద్వారా హార్దిక్ రీఎంట్రీ ఇస్తాడని భావించారు.
హార్దిక్ పాండ్యాకు షాక్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ బరోడా జట్టులో దక్కని చోటు




