2018లో బంతి ఆకారాన్ని మార్చడానికి శాండ్‌పేపర్ ఉపయోగించిన విషయం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులోని ప్రతీ ఒక్కరికీ తెలుసని మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తెలిపారు. బ్యాటర్లు, బౌలర్లు, సిబ్బందితో సహా టీమ్ మొత్తానికి ఈ విషయం తెలుసని 39 ఏళ్ల ఖవాజా స్పష్టం చేశారు. ఈ వివాదంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌లు నిషేధానికి గురయ్యారు.