తెలంగాణలో పంట నష్టంతో రైతులు అల్లాడుతుంటే మంత్రులు హెలికాప్టర్లలో పర్యటిస్తూ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. ఖమ్మంలో సండ్ర వెంకట వీరయ్యతో కలిసి మాట్లాడిన ఆయన, ఉమ్మడి జిల్లాలో 34 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.