కరువు సమయంలో మంత్రులు హెలికాప్టర్లు వాడటంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండిపడ్డారు. ఆ ఖర్చులు తగ్గించి వర్షాలు, గాలుల వల్ల పంటలు, ఇళ్లు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు సరిగా పనిచేయడం లేదని ఖమ్మంలో రవిచంద్రతో కలిసి అన్నారు.