దీపావళి తర్వాత డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో న్యూఢిల్లీలో బంగారం ధర వరుసగా నాలుగో సెషన్‌లో రూ.2,500 తగ్గి రూ.1,40,900కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల కొనుగోళ్లు తగ్గడంతో కిలో వెండి ధర రూ.3,500 తగ్గి రూ.1,84,000కు పడిపోయిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ప్రతినిధి తెలిపారు.