ఫ్లోరిడాలోని ‘సేవ్ ది చింప్స్’ కేంద్రం భారీ వర్షాలకు నీటమునిగింది. సిబ్బంది వెళ్లలేని పరిస్థితి రావడంతో డ్రోన్ల ద్వారా పేపర్ బ్యాగుల్లో అరటిపండ్లు, ఇతర వస్తువులను చింపాంజీలకు అందించారు. కాలేబ్ అనే చింపాంజీ అరటిపండు తినడం, మరొకటి దుప్పటిపై విశ్రమించడం చూపే వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.