ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం కూడా కొనసాగింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులపై భారీ మెజార్టీలతో విజయం సాధించారు. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ప్రాంత నకిరేకల్లు జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి డాక్టర్ నాగోతు వెంకట లక్ష్మి సరోజ గెలుచుకున్నారు.