భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేకు వర్షం పడే సూచనలు ఉన్నాయి. హామిల్టన్‌లో నవంబర్ 10న జరగనున్న ఈ మ్యాచ్‌ రోజున 80 శాతం వరకు వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచి 2-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది.