న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కేఎల్ రాహుల్ గేమ్ ఛేంజర్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా తనకు బహుమతిగా వచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను మైదానంలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా అధికారికి ఇచ్చాడు. రాహుల్ చేసిన ఈ పనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ పంచుకుంది.