ఆంధ్రప్రదేశ్‌లో 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల్లో కీలక మార్పులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ 'పరఖ్' నిబంధనలకు అనుగుణంగా ఇంటర్ విద్యా మండలి వీటిని రూపకల్పన చేస్తోంది. కంఠస్థం చేసే విధానానికి స్వస్తి పలికి, విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచన, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడమే దీని లక్ష్యం.