చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాలు శంషాబాద్‌లోని ముచ్చింతల్ ఆశ్రమంలో నవంబర్ 8 నుండి 12 వరకు జరుగుతున్నాయి. ఈ ఆధ్యాత్మిక వేడుకలకు మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు హాజరై స్వామివారికి శుభాకాంక్షలు తెలిపారు. జీయర్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.