డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండలో శనివారం లక్ష సంతకాల సేకరణ చేపట్టారు. ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి పాలమూరుకు ముప్పు ఉందని, సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పాలమూరు అధ్యయన వేదిక నేత అశోక్‌గౌడ్ కోరారు.