హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఆస్బెస్టాస్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున పేపర్ టీ కప్పుల తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ మంటలు పక్కనే ఉన్న నెయ్యి, కుర్‌కురే, హల్దీరామ్ గోదాములకు వ్యాపించాయి. నాలుగు ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కూకట్పల్లిలోని గోదాముల్లో భారీ అగ్నిప్రమాదం




