తెలంగాణలో వర్షాలు తగ్గి చలి ప్రభావం పెరుగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరిన్ని పడిపోయే అవకాశముంది. హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17-19 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. రాజేంద్రనగర్, శంషాబాద్, మేడ్చల్, ఘట్‌కేసర్ వంటి శివారు ప్రాంతాల్లో ఉదయం పొగమంచు అలముకుంటోంది.