బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ త్వరలోనే మెగాఫోన్ పట్టనున్నట్లు తెలిపారు. రాబోయే రెండు మూడేళ్లలో దర్శకుడిగా తొలి సినిమా తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అందరికీ నచ్చేలా కుటుంబ కథా చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నట్లు, ప్రస్తుతం కథలు రాసే పనిలో ఉన్నానని ఆయన వెల్లడించారు.