రెండేళ్ల పాటు విడుదలకు ఏ ఒక్కరూ ముందుకు రాని ఒక సినిమాను చూసి థియేటర్ల నుంచి ప్రేక్షకులు కన్నీళ్లతో బయటకు వస్తున్నారు. సినిమా ప్రదర్శిస్తున్న చోట హీరాదేవి, పదం సింగ్లను ప్రేక్షకులు కలుసుకుంటున్నారు. కొందరు వారి పాదాలను తాకి కౌగిలించుకోగా, మరికొందరు తమ గ్రామాలు, తల్లిదండ్రులను ఈ చిత్రం గుర్తుచేసిందని చెప్పారు.
రెండేళ్లుగా విడుదల కాని సినిమా: థియేటర్లలో ప్రేక్షకుల భావోద్వేగం



