కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన బూడిద నితిన్ (23) అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తిచేసిన అతడు, ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నితిన్ ఉరేసుకున్నాడు. అతడి తండ్రి రమేశ్ ఫిర్యాదుతో ఎల్‌ఎండీ ఎస్సై అరుణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగం దొరక్క యువకుడి ఆత్మహత్య
Karimnagar




