దీపావళి సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. తొమ్మిదేళ్ల తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. సెన్సెక్స్ 29 పాయింట్లు తగ్గి 80,999 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు క్షీణించి 24,986 వద్ద ముగిశాయి. సన్ ఫార్మా, టాటా స్టీల్ లాభపడగా.. ఎం&ఎం, ఇండిగో నష్టపోయాయి.