మురసు తుఫాన్‌ ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో వర్షాలు కురుస్తున్నాయి. సత్యంపేట వద్ద పాములేరు వాగు ఉధృతితో పాల్వంచ-అన్నపురెడ్డిపల్లి మార్గంలో రాకపోకలు నిలిచాయి. రాజుపేట వద్ద తాత్కాలిక అప్రోచ్ కొట్టుకుపోవడంతో పాల్వంచ-దమ్మపేట మధ్య వాహనాలు ఆగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వరి, మిర్చి పంటలు నీట మునిగాయి.