హైదరాబాద్‌ నగరంలో పుష్పక్ ఏసీ బస్సుల్లో సాధారణ ప్రయాణాలకు ఆర్టీసీ అనుమతించింది. ఉప్పల్, ఎల్‌బీ నగర్, అమీర్‌పేట్, గచ్చిబౌలి వంటి ప్రధాన మార్గాల బస్ స్టాప్‌లలో ఇవి ఆగుతాయి. తక్కువ ఛార్జీలతో ప్రయాణికులకు సుఖవంతమైన ఏసీ ప్రయాణం అందుబాటులోకి రానుంది. యూపీఐ లేదా నగదు ద్వారా టికెట్లు పొందవచ్చు.