భద్రాచలం కొత్తగూడెం జిల్లా మిట్టగూడెం వద్ద బస్సులో చిల్లర విషయంలో జరిగిన వివాదంలో ప్రయాణికురాలు తోసేయడంతో మణుగూరు డిపో ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందారు. ప్రభుత్వం ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.