హైదరాబాద్‌లో తాగునీటి వృథాను నిరోధించేందుకు జలమండలి 'PAANI' యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు 437 మంది వాటర్ వారియర్లుగా నమోదయ్యారు. పైపులతో వాహనాలు కడగడం, ట్యాంకులు పొంగిపొర్లడం వంటి నీటి దుర్వినియోగాన్ని ఈ యాప్ ద్వారా ఫొటోలతో రిపోర్ట్ చేయవచ్చు. వీటిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు.