అమరావతికి భూములిచ్చిన 29 గ్రామాల ప్రజలు సమస్యలు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు సీఆర్‌డీఏ కార్యాలయానికి వెళ్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నివాస స్థలాలను వ్యవసాయ భూములుగా చూపించడం వల్ల గ్రామ కంఠాల పరిధిలోని ఇళ్లకు ప్రమాదం పొంచి ఉందని, సమస్యలు చంద్రబాబు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లేదని వాపోయారు.