అనంతపురం కార్పొరేషన్‌లో వైసీపీ అభ్యర్థి రమేష్ గౌడ్ 5,981 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పొత్తులో ఈ స్థానాన్ని తీసుకున్న బీజేపీ, సీనియర్లను కాదని కోట్ల అజేష్ యాదవ్‌కు టికెట్ ఇవ్వడమే ఓటమికి కారణమనే చర్చ సాగుతోంది. 62 డివిజన్లలో టీడీపీ 31, వైసీపీ 20, జనసేన 6, బీజేపీ ఒకచోట గెలిచాయి.