మున్సిపల్ ఎన్నికల విజయంతో నూతనోత్సాహంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు, ఆ సంబరాల్లో ఎక్కువ సమయం గడపకుండా తదుపరి ఎన్నికలపై దృష్టి పెట్టారు. గురువారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎన్డీయే కూటమి కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. కూటమి విజయం సాధించాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.