హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలపై హైడ్రా చర్యలు ముమ్మరం చేసింది. కొంపల్లి సమీపంలోని దూలపల్లి వద్ద మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్ ప్రహరీ గోడను, ప్రవేశ ద్వారాన్ని అధికారులు కూల్చివేశారు. దాదాపు 15 ఎకరాల వరకు ఆక్రమించి ఈ సరిహద్దు గోడను నిర్మించినట్లు హైడ్రా పేర్కొంది.