ఈజిప్టులోని గిజా ప్రావిన్స్, అల్-అయ్యత్ జిల్లాలో ఆదివారం రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మరణించారు. దాదాపు 120 మంది గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొనగా, 64 మంది గాయపడినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఘటనా స్థలంలో క్రేన్లతో శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈజిప్టులో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ: నలుగురు మృతి, 120 మందికి గాయాలు




