అమెరికాలోని కాలిఫోర్నియాలో స్కైడైవింగ్ చేస్తూ పారాచూట్లు చిక్కుకోవడంతో గాల్లో ఢీకొని జార్జియా జీన్ (56), లెవి పిమెంటెల్ (29) అనే ఇద్దరు అనుభవజ్ఞులు మరణించారు. 1,700కు పైగా జంప్‌లు చేసిన జార్జియా, ఐఫ్లై సంస్థ ఇన్‌స్ట్రక్టర్ పిమెంటెల్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారని షెరీఫ్ కార్యాలయం తెలిపింది.