ఈ నెల 11న నిర్మల్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రైతు గర్జన సభ జరగనుంది. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. సభా ప్రాంగణంలో ఏర్పాట్లను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బాల్క సుమన్ పరిశీలించారు.