ధంతేరస్, దీపావళి సందర్భంగా బంగారం కొనేముందు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆభరణాల ధర స్వచ్ఛత, బరువు, తయారీ ఛార్జీలపై ఆధారపడి ఉంటుంది. 22, 18 లేదా 14 క్యారెట్ల స్వచ్ఛతతో పాటు BIS హాల్‌మార్క్, HUID నంబర్ తప్పక తనిఖీ చేయాలి. ఈ వివరాలను BIS కేర్ యాప్‌లో సరిచూసుకోవచ్చు.