హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సుల్లో టీజీఎస్ఆర్టీసీ టికెట్ ధరలను తగ్గించింది. బీహెచ్ఈఎల్ డిపో నుంచి విజయవాడ, గుంటూరు, బెంగళూరు, మైసూరు వెళ్లే బస్సులకు ఇవి వర్తిస్తాయని రంగారెడ్డి ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. విజయవాడ రాజధాని బస్సుపై రూ.100, గుంటూరు సూపర్ లగ్జరీపై రూ.80 వరకు ఆదా అవుతుంది.