యూకేలో ఉన్నత చదువులు ముగించిన విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేట్ వీసాతో రెండేళ్లు అక్కడే ఉద్యోగ అనుభవం పొందవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటించే వర్సిటీలలో చదివిన వారికే ఇది వర్తిస్తుంది. గ్లోబల్ టాలెంట్, హెచ్‌పీఐ వీసాలలోనూ మార్పులు చేసి, పరిశోధనల్లో 100కు పైగా సంస్థల ద్వారా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు బ్రిటన్ అవకాశాలు విస్తరించింది.