తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ఇకపై సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షల ఫలితాలు, ప్రోగ్రెస్ కార్డులను నేరుగా వాట్సాప్ ద్వారానే పొందవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ మంగళవారం వెల్లడించారు. ఈ సదుపాయాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.