కేంద్ర ప్రభుత్వ తాజా యుడైస్ ప్లస్ నివేదిక ప్రకారం భారత్‌లో వయసు పెరిగే కొద్దీ పిల్లలు బడి మానేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో డ్రాపౌట్ రేటు 0.3 శాతంగా ఉండగా, 6-8 తరగతుల్లో 3.5 శాతానికి చేరుతోంది. సెకండరీ స్థాయిలో డ్రాపౌట్ రేటు గణనీయంగా 11.5 శాతానికి ఎగబాకుతోందని వెల్లడైంది.